జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ నగరంలోని ప్రముఖ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ వేదికగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు గారి మనవడు చిరంజీవి నక్షిత్ రాయుడు మొదటి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు సుబ్బారాయుడు గారి ఆహ్వానం మేరకు కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మరియు ముఖ్య ప్రజాప్రతినిధులు విచ్చేసి సందడి చేశారు.
ఈ వేడుకలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధా వెంకన్న గారు, అలాగే జనసేన పార్టీ కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారు కలిసి పాల్గొన్నారు. జన్మదినం జరుపుకుంటున్న చిన్నారి నక్షిత్ రాయుడును ఆప్యాయంగా ఎత్తుకుని, ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో ఆశీర్వదించారు.
అనంతరం పెనుగొండ సుబ్బారాయుడు గారి కుటుంబ సభ్యులకు కూటమి నేతలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందజేశారు.
