జన గళం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా క్షేత్రస్థాయి సమగ్ర సమాచారాన్ని సేకరించి, పార్లమెంట్ కో-ఆర్డినేషన్ కమిటీకి ఎప్పటికప్పుడు నివేదించేందుకు వీలుగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అసెంబ్లీ సమన్వయ కమిటీలను నియమించారు. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మరియు తిరువూరు నియోజకవర్గాలకు ఈ కమిటీలను ఖరారు చేశారు. వార్డు, పంచాయతీ స్థాయిల్లో కూటమి బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక కసరత్తు, క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను సమన్వయం చేయడంలో ఈ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ పార్లమెంట్ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడి ఊపందుకుంది.
స్థానిక సమరానికి జనసేన పక్కా వ్యూహం: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేషన్ కమిటీల నియామకం!
Slug: pawan-kalyan-appoints-vijayawada-parliament-assembly-local-body-elections-coordination-committees
