జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.
విమానాశ్రయం వద్దకు చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్‌కు రాష్ట్ర మంత్రులు మరియు అధికారులు సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి బయలుదేరింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. అలాగే విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొని పలు కార్యక్రమాలను పరిశీలించనున్నారు. తమిళనాడు సీఎం పర్యటన నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ మరియు విజయవాడ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
