బ్రేకింగ్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మార్గదర్శకాలు విడుదల.. అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాల పూర్తి వివరాలుజనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ రాకపై పెడనలో హర్షాతిరేకాలు.. ‘టీమ్ బత్తిన’ ఆధ్వర్యంలో ఘన స్వాగతంజనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షంవిజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన.. కీలక బాధ్యతల్లో వంగవీటి రాధా, సామినేని, అమ్మిశెట్టిఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంమున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మార్గదర్శకాలు విడుదల.. అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాల పూర్తి వివరాలుజనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ రాకపై పెడనలో హర్షాతిరేకాలు.. ‘టీమ్ బత్తిన’ ఆధ్వర్యంలో ఘన స్వాగతంజనసేనలోకి వంగవీటి రాధా రాక శుభపరిణామం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హర్షంవిజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన.. కీలక బాధ్యతల్లో వంగవీటి రాధా, సామినేని, అమ్మిశెట్టిఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
అమరావతి

నాగాయలంకలో మడ మొక్కల పెంపక కార్యక్రమం ప్రారంభం: జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ నాగబాబు

​Slug: nagababuji-buddha-prasad-launch-mangrove-plantation-in-nagayalanka
నాగాయలంకలో మడ మొక్కల పెంపక కార్యక్రమం ప్రారంభం: జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ నాగబాబు

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: భూమిపై జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ-ఫారెస్టేషన్ ఫర్ ఎకాలజికల్ ఎ్రిచ్‌మెంట్ చైర్మన్, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం సముద్ర తీరంలో మడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మరియు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మంగళవారం ప్రారంభించారు. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ సహకారంతో, కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజా ప్రగతి సేవా సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల మడ మొక్కలు నాటే రెండో విడత పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

​ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సముద్ర తీరానికి రక్షణ కవచంలా నిలిచి, సముద్ర జీవరాశి సమృద్ధిగా పెరిగేందుకు మడ అడవులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. భూమిపై జీవించే హక్కు ప్రతి జీవికీ ఉందని, వాటి మనుగడకు అనువైన వాతావరణాన్ని కాపాడే బాధ్యత మనుషులపై ఉందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ మరియు పంచాయతీరాజ్ శాఖల ద్వారా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వ్యాప్తి లక్ష్యంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. కేరళ సహా పలు రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రంలోనూ వృక్ష సంపద పరిరక్షణ కోసం వాల్టా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.

Related News Desk మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మార్గదర్శకాలు విడుదల.. అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాల పూర్తి వివరాలు

​అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సముద్ర తీర కోతను నివారించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను స్వీకరించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ద్వారా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ చర్యలకు ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ నాగబాబు సంకల్పం తోడవటం అటవీకరణకు అదనపు బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సలహాదారు మల్లికార్జున్, ఏపీ గ్రీన్ బోర్డు సీఈఓ బీఎన్ఎన్ మూర్తి, అటవీ శాఖ డీఎఫ్ఓ ఏ.త్రిమూర్తులు రెడ్డి, ప్రజా ప్రగతి సేవా సంఘం చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావుతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్, జనసేన, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.