జన గళం విజయవాడ సెంట్రల్ బ్యూరో: పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని మరోసారి రుజువైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ దుర్గా అగ్రహారం అనపర్తివారి వీధికి చెందిన టీడీపీ క్రియాశీల కార్యకర్త మంద శ్రీనివాస్ (38) ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు.. ఆ కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆ హామీని తక్షణమే నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం ద్వారా ‘టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి’ నుంచి మంజూరైన రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయల) ఆర్థిక సహాయం చెక్కును ఈరోజు మంద శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక భరోసా కల్పించినందుకు మృతుడి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే బొండా ఉమా ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతనిస్తారని పార్టీ శ్రేణులు కొనియాడాయి.
