బ్రేకింగ్ న్యూస్
విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్
ఆంద్ర ప్రదేశ్

ఉయ్యూరులో గంజాయి ముఠా గుట్టురట్టు?: పోలీసుల అదుపులో పలువురు.. దాడుల భయంతో మిగిలిన బ్యాచ్ పరార్!

uyyuru-police-crackdown-on-ganja-gang-suspects-detained-search-operations
ఉయ్యూరులో గంజాయి ముఠా గుట్టురట్టు?: పోలీసుల అదుపులో పలువురు.. దాడుల భయంతో మిగిలిన బ్యాచ్ పరార్!

​జన గళం క్రైమ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది. యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో ఒక గంజాయి ముఠాలోని కొందరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుమానితుల నుంచి గంజాయి సరఫరా చేసే ముఠా మూలాలు, ప్రధాన సూత్రధారులు, పట్టణంలో తరచూ కొనుగోలు చేసే వారి వివరాలను రాబడుతున్నట్లు వార్తలు రావడంతో స్థానికంగా తీవ్ర అలజడి రేగింది. పోలీసుల విచారణలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతో గంజాయి సేవించే, సరఫరా చేసే పలువురు యువకులు ఊరు విడిచి పరారైనట్లు స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.

Related News Desk 19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపు

​పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నెట్‌వర్క్‌లోని మిగిలిన సభ్యులను, ఇతర ప్రాంతాల నుంచి సరుకును తీసుకొస్తున్న ప్రధాన డీలర్లను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. క్షేత్రస్థాయిలో దాడులు, విస్తృత విచారణ పూర్తయిన అనంతరం గంజాయి స్వాధీనం, అరెస్టుల వివరాలపై స్పష్టతనిస్తూ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.