సెల్‌ఫోన్ రిపేర్ కోసం వచ్చిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి.హేమదుర్గ (26) ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచేస్తోంది.
తన సెల్‌ఫోన్ రిపేర్ కోసం ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకుని అమీర్‌పేటకు ర్యాపిడో బైక్‌పై బయలుదేరింది.
అమీర్‌పేట బిగ్‌బజార్ వెనుక గేట్ సమీపంలోకి రాగానే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో హేమదుర్గ అక్కడికక్కడే మృతిచెందింది.
బస్సు డ్రైవర్ షేక్ అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
