రచన: జన గళం గన్నవరం డెస్క్: గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనకు అత్యంత ఆప్తులైన ప్రముఖ నాయకుడు నెరుసు ఆంజనేయులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా నాయకుడిగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నెరుసు ఆంజనేయులు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, గన్నవరం ప్రగతికి అహర్నిశలు పాటుపడుతున్న యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్న ఆయన నాయకత్వంలో గన్నవరం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
