జన గళం కడప/ప్రొద్దుటూరు బ్యూరో: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్‌కు హెలిప్యాడ్ వద్ద పార్టీ శ్రేణులు, నేతలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు తాతం శెట్టి నాగేంద్ర డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతించారు.
అనంతరం పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన తాతం శెట్టి నాగేంద్ర.. ఆయన యోగక్షేమాలను ఆరా తీశారు. జనసేనాని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై క్లుప్తంగా చర్చించారు. డిప్యూటీ సీఎం పర్యటనతో స్థానిక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న తమ అధినేతను స్వయంగా కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని నాగేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
