జన గళం మచిలీపట్నం బ్యూరో: మచిలీపట్నం (బందరు) కేంద్రంగా జనసేన పార్టీ కార్యకలాపాలు, పార్టీ సిద్ధాంతాల ప్రచారంలో భాగంగా స్థానిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొట్టె వెంకటరావుతో కలిసి జనసేన పార్టీ ప్రముఖ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘బందరు జనసేనాని’ పత్రిక ప్రతిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పత్రికలో ప్రచురితమైన ప్రజా సమస్యల కథనాలు, కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలను వారు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో పత్రికలు, మీడియా మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. బందరు ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గళమెత్తుతూ, క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పత్రిక యాజమాన్యాన్ని, బృందాన్ని వారు అభినందించారు. రాబోయే రోజుల్లో కూటమి అభివృద్ధి పాలనను, పార్టీ కార్యాచరణను మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరవేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
