జన గళం పెడన/బందరు బ్యూరో: పార్టీ స్థాపించిన నాటి నుంచి సామాన్య కార్యకర్తగా సేవలందిస్తున్న తనను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల పార్లమెంట్ కమిటీ సమన్వయకర్తగా నియమించినందుకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి, కొమ్మల్లపూడి పీఏసీఎస్ చైర్మన్ కూనసాని నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం ఆవిర్భావ సభ సమన్వయకర్తగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన తనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు, శ్రేణుల సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించేలా అహర్నిశలు పనిచేస్తానని నాగబాబు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల పార్లమెంట్ సమన్వయకర్తగా కూనసాని నాగబాబు: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతా వందనములు!
Slug: koonasani-nagababu-appointed-parliament-committee-coordinator-thanks-pawan-kalyan-pedana
