జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: బెజవాడ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఆయనకు ముందస్తు స్వాగతం, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక జనసేన పార్టీ నాయకులు ప్రధాన కూడళ్లలో ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బ్యానర్లు నగరవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వంగవీటి రాధా రాజకీయ అడుగులపై గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొనగా, తాజా ప్రచారంతో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ చేరికకు సంబంధించి పార్టీ అధిష్టానం లేదా రాధా వర్గం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
