జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సర్వసిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై సమగ్ర వివరాలను నివేదించారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను జారీ చేస్తున్నట్లు గవర్నర్కు తెలియజేశారు.
విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేటి ఉదయం 11:30 గంటలకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విలేకరుల సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల సమగ్ర ఎన్నికల షెడ్యూల్తో పాటు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి రానుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
