జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తిరువూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి సేవలందిస్తున్న సాధారణ కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తిరువూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడిగా పగడాల లక్ష్మణరావును నియమించారు. ఈ నియామకంపై ఆయన పార్టీ అగ్రనాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పగడాల లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదురైనా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలే తనకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని, ఎలాంటి ప్రలోభాలకూ తలొగ్గకుండా నిజాయితీగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ అవకాశాన్ని కల్పించినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, తిరువూరు నియోజకవర్గంలో కూటమి భారీ విజయం సాధించేలా ముందుంటానని లక్ష్మణరావు భరోసా ఇచ్చారు. నియామకం పట్ల పలువురు పార్టీ నాయకులు, జనసైనికులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
