జన గళం పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘం ఎన్నికల పోరులో ఎన్డీయే కూటమి కీలక ఘట్టానికి చేరుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అధికారిక చైర్పర్సన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బళ్ల జ్ఞానలింగ జ్యోత్స్నారాణి గారు నేడు (ఆదివారం, అక్టోబర్ 18) నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం 10:00 గంటలకు స్థానిక ప్రసిద్ధ శ్యామలాంబ అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పెడన మున్సిపల్ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. అనంతరం శుభ ముహూర్తమైన ఉదయం 11:47 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఈ నామినేషన్ మహోత్సవంలో పెడన నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి పిలుపునిచ్చింది.
