జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతున్న వేళ 39వ డివిజన్‌లో కూటమి ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు సంపూర్ణంగా బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి తిరుపతి అనూష డివిజన్ పరిధిలోని వీధివీధినా విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడ సమగ్ర రూపురేఖలు మారాలంటే కూటమి అధికారంలోకి రావడం ఎంతో అవసరమన్నారు. నగర మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక ఓటు, 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరో ఓటు వేసి కూటమిని ఆశీర్వదించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కూటమి శ్రేణులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
