జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన శ్రీమతి పి. మాధవి తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో కూటమి ప్రతినిధిగా ఆమె బరిలోకి దిగారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి నేతలు మాట్లాడుతూ, స్థానిక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలంతా సంపూర్ణ ఐక్యమత్యంతో శ్రమించి కూటమి అభ్యర్థి పి. మాధవిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.
ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, ఎన్నికల పరిశీలకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
