జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత శ్రీ కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు గారు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ.. “విజయవాడ మేయర్గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఈ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించి, మీ ప్రజా జీవితంలో మరెన్నో ఉన్నతమైన మైలురాళ్లను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జనసేన పార్టీతో మీ ప్రయాణం విజయవంతం కావాలని, నగర ప్రజలకు ఎంతో మంచి జరగాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణకు జనసేన అధిష్టాన కీలక నేత నుంచి సంపూర్ణ మద్దతు, ఆశీస్సులు లభించడంతో నగరవ్యాప్తంగా కూటమి నాయకులు, జనసైనికులు, అభిమానుల్లో మరింత ఉత్సాహం వెల్లివిరిసింది.
