జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి సమరశంఖం పూరించింది. ఉమ్మడి మేయర్ అభ్యర్థిగా శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు నామినేషన్ దాఖలు చేసిన మహోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరవ్యాప్తంగా కూటమి నాయకులు రాధాకృష్ణ గారికి ఘనంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ సిద్ధాంతాలకు అనుగుణంగా బెజవాడ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా సాగుతామని నాయకులు ప్రతినబూనారు. రాధాకృష్ణ గారి నాయకత్వంలో విజయవాడ నగరపాలక పీఠంపై కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.
