జన గళం భీమవరం/హైదరాబాద్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను స్వయంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా కనకరాజు సూరి గారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మొదటి నుంచీ అంకితభావంతో పనిచేసిన సీనియర్ నేతకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా యోగక్షేమాలు కనుక్కున్నారని తెలియజేశారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, త్వరలోనే మరింత నూతనోత్సాహంతో ప్రజల్లోకి వచ్చి ప్రజాసేవలో కొనసాగాలని రామ్ తాళ్లూరి గారు ఆకాంక్షించారు.
