జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సమరశంఖం పూరించింది. జనసేన పార్టీ తరపున కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా) గారికి తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో అధికారిక మద్దతును ప్రకటించింది.
కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వం, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను విజయవాడ నగర పాలక సంస్థలోనూ స్థాపించేందుకు శ్రేణులు ఏకతాటిపైకి రావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా నిలబెట్టిన వంగవీటి రాధాకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరింది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కులం పేరుతో ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు బ్యాంకు చీలకుండా ఐక్యంగా ఉంటూ కులతత్వ శక్తులకు ఓటుతో గట్టి సమాధానం చెప్పాలని నాయకులు స్పష్టం చేశారు. రాధాకృష్ణ నాయకత్వంలో బెజవాడను అంతర్జాతీయ స్థాయి అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని వెల్లడించారు.
