ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కామినేని కొణిదెల గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రాలయం చేరుకున్న ఆమెకు శ్రీమఠం అధికారులు, అర్చక బృందం పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
ముందుగా సంప్రదాయం ప్రకారం గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఉపాసన, అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతి పరమపూజ్య శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీని దర్శించుకుని వారి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆమెను శాలువాతో సత్కరించి, శ్రీమఠం జ్ఞాపికతో పాటు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.
Slug: upasana-konidela-visits-mantralayam-raghavendra-swamy-subhudhendra-teertha-blessings
