ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా నిలిచిన జనసేన పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో కీలక రాజకీయ పరీక్షగా మారాయి. దశాబ్ద కాలంగా కేసులు, వేధింపులు భరించి సొంత ఖర్చులతో పార్టీ జెండాను నిలబెట్టిన పాత క్యాడర్ మనోగతాన్ని విస్మరించి, అధికారం చూసి వస్తున్న వలస నేతలకు, ధనబలం ఉన్నవారికే టికెట్లు దక్కుతాయనే ప్రచారం క్షేత్రస్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది.
గత స్థానిక సమరాల్లో నామినేషన్లు వేసి పోరాడిన వీర సైనికులను గుర్తించడంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ అనుసరించిన ‘వన్-టు-వన్ సంభాషణ, గ్రౌండ్ సర్వే’ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా నిబద్ధత గల స్వతంత్ర సర్వేల ఆధారంగానే కూటమి సీట్ల సర్దుబాటులో జనసేనకు న్యాయమైన వాటా దక్కేలా అధినాయకత్వం చొరవ చూపాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది.
