జన గళం మచిలీపట్నం బ్యూరో: కృష్ణా జిల్లా స్థానిక సంస్థల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కౌంటింగ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థులు జిల్లావ్యాప్తంగా విజయదుందుభి మోగించారు. మొత్తం ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా 17 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన పార్టీ 3 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో ఘన విజయం సాధించి జిల్లా పరిషత్ పీఠంపై కూటమి జెండాను ఎగురవేశాయి.
మరోవైపు మిగిలిన స్థానాల్లో టీడీపీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండిపెండెంట్ 1, వైసీపీ 1 స్థానంలో లీడ్‌లో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కూటమి సమన్వయం, అభివృద్ధి పాలనకు జిల్లా గ్రామీణ ప్రజలు పట్టం కట్టారని ఈ తీర్పు రుజువు చేసింది.
కృష్ణా జిల్లా జడ్పీటీసీ సమగ్ర ఫలితాలు – పార్టీల వారీగా:
• తెలుగుదేశం పార్టీ (TDP): 17 స్థానాలు గెలుపు (మరో 3 స్థానాల్లో ఆధిక్యం)
• జనసేన పార్టీ (JSP): 3 స్థానాలు గెలుపు
• భారతీయ జనతా పార్టీ (BJP): 1 స్థానం గెలుపు
• ఇతరులు/వైసీపీ: చెరి 1 స్థానంలో లీడ్
గెలుపొందిన జడ్పీటీసీ అభ్యర్థుల సమగ్ర జాబితా (మండలాల వారీగా):
- 1. అవనిగడ్డ: విక్కుర్తి జయలక్ష్మి (టీడీపీ) – విజేత
- 2. బంటుమిల్లి: రేవు గోపాలకృష్ణ (టీడీపీ) – విజేత
- 3. చల్లపల్లి: రావెళ్ల ఉదయ్ కుమార్ (టీడీపీ) – విజేత
- 4. గుడివాడ రూరల్: అంగడాల భారతి (టీడీపీ) – విజేత
- 5. గుడ్లవల్లేరు: వర్రే బలరామకృష్ణ (జనసేన) – విజేత
- 6. గూడూరు: చోడగం నాంచారమ్మ (టీడీపీ) – విజేత
- 7. కంకిపాడు: దండమూడి పూజిత (టీడీపీ) – విజేత
- 8. కోడూరు: బొలిశెట్టి అరుణ (టీడీపీ) – విజేత
- 9. కృత్తివెన్ను: గరికపాటి శ్రీలత (జనసేన) – విజేత
- 10. బందరు (నార్త్): లంకె ఉషారాణి (టీడీపీ) – విజేత
- 11. బందరు (సౌత్): కాగిత వెంకటేశ్వరరావు (టీడీపీ) – విజేత
- 12. మోపిదేవి: మురాల సీతమ్మ (జనసేన) – విజేత
- 13. నాగాయలంక: భోగాది రమాదేవి (బీజేపీ) – విజేత
- 14. నందివాడ: దుడ్ల ప్రదీప్ కుమార్ (టీడీపీ) – విజేత
- 15. పామర్రు: శీలం వెంకటేశ్వరమ్మ (టీడీపీ) – విజేత
- 16. పమిడిముక్కల: తాతినేని ప్రవళి (టీడీపీ) – విజేత
- 17. పెడన: కాగిత లక్ష్మి (టీడీపీ) – విజేత
- 18. పెదపారుపూడి: పాగోలు కాటమరాజు (టీడీపీ) – విజేత
- 19. పెనమలూరు: కానూరు సరిత (టీడీపీ) – విజేత
- 20. తోట్లవల్లూరు: గూగులమూడి సుమ (టీడీపీ) – విజేత
- 21. ఉయ్యూరు: కంభం రమేష్ (టీడీపీ) – విజేత
