జన గళం రాజంపేట బ్యూరో: చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దివ్య దీపాల పర్వదినం దీపావళి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు గారు ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ దీపావళి పర్వదినం ప్రతి కుటుంబంలోనూ ఆనందాల కాంతులు విరజిమ్మాలని, సమాజంలో ప్రేమానురాగాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, సురక్షితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని శ్రీనివాస రాజు గారు ఆకాంక్షించారు.
