బ్రేకింగ్ న్యూస్
హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టతహనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత
తెలంగాణ

వినాయక చవితి పర్వదినాన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ డెస్క్: వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ సంప్రదాయంలో ఏ విఘ్నమైనా తొలగించి విజయాలను ప్రసాదించే దైవంగా వినాయకుణ్ణి సమాజం కొలుస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మన ఆచారాల ప్రకారం ఏ దైవ పూజలు లేదా ధార్మిక క్రతువులు ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడినే పూజిస్తామని, తద్వారా గణనాయకుడికి తొలి ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటారని, ఈ పండుగలో పెద్దలు, పిల్లలు అందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదన

రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లేలా చూడాలని ఏకదంతుడిని ప్రార్థించినట్లు కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయ రంగం మళ్లీ పూర్తిగా గాడినపడి, పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో కళకళలాడేలా దీవించాలని వినాయకుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.