జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: దేశ స్వాతంత్ర్య సమరయోధులు, నిస్వార్థ రాజకీయ నాయకులు, భారతరత్న మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి గారు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జై జవాన్ – జై కిసాన్ నినాదంతో సైనికులను, రైతులను దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని తంబళ్ళపల్లి రమాదేవి కొనియాడారు. ఆయన జీవితం దేశ సేవకు, నిరాడంబరతకు, నిబద్ధతకు నిలువెత్తు రూపమని పేర్కొన్నారు. పదవి కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించిన ఆయన ఆదర్శవంతమైన జీవన విధానం నేటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు.
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా శాంతియుత, సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ సమైక్యతను, అఖండతను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ జయంతి వేడుకల సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులు అర్పించి ఆ మహానేత చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆమె కోరారు.
Slug: nandigama-thamballapalli-ramadevi-lal-bahadur-shastri-jayanti
