జన గళం రాజంపేట/కడప బ్యూరో: సమాజ ప్రగతికి, మానవ వికాసానికి అక్షరజ్ఞానమే బలమైన పునాది అని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అక్షరాస్యత ప్రాధాన్యతను చాటుతూ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “విద్య అనేది కేవలం పుస్తకాల్లో ఉండే సమాచారం కాదు.. అజ్ఞానం అనే చీకటి నుంచి చైతన్యం అనే వెలుగులోకి నడిపించే ఒక మహా ఉద్యమం” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నాణ్యమైన విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. నిరుపేద వర్గాల పిల్లలకు అక్షర జ్ఞానం అందించడమే కాకుండా, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజంలో అసమానతలు తొలగి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని, ప్రతి పౌరుడూ అక్షరాస్యుడై దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
Slug: international-literacy-day-rajampet-parliament-janasena-incharge-yallatooru-srinivasa-raju-wishes
