రచన: మహమ్మద్ రఫీ, జన గళం విజయవాడ డెస్క్: జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, బెజవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ శ్రీమతి పద్మావతి ఠాగూర్ తన అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వస్థలమైన విజయవాడకు తిరిగి వస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) పర్యటనకు వెళ్లిన ఆమె, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన పూర్తి చేసుకుని నగరానికి చేరుకుంటున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, దుర్గగుడి పాలకమండలి సభ్యులు మరియు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. . ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
