జన గళం విజయవాడ బ్యూరో: మహిళల్లో తీవ్ర సంతానలేమికి కారణమయ్యే ‘అడెనోమైయోసిస్’ (గర్భాశయ గోడల్లో వాపు మరియు కణజాల పెరుగుదల) సమస్య ఉన్నప్పటికీ, ఏకంగా 22 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక జంట సహజ పద్ధతిలోనే (న్యాచురల్ ప్రెగ్నెన్సీ) గర్భధారణ పొందడం వైద్యరంగంలో ఆశాకిరణంగా నిలిచింది. విజయవాడ ప్రసాదం పాడులోని ‘డా. వై.ఎస్. బాబు ట్రస్ట్ క్లినిక్’ లో సరైన రోగనిర్ధారణ, సమగ్ర హోలిస్టిక్ వైద్య విధానాల ద్వారా ఈ ఫలితం సాధ్యమైంది.
సంతానలేమితో రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో ఆసుపత్రులు తిరిగి నిరాశ చెందిన దంపతులకు డా. వై.ఎస్. బాబు ప్రత్యేక చికిత్సా విధానాలతో భరోసా కల్పించారు. గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, హార్మోన్ల అసమతుల్యతను సరిదిద్దడం, జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు తేవడం ద్వారా ఎలాంటి క్లిష్టమైన కృత్రిమ పద్ధతులు లేకుండా సహజంగానే గర్భం దాల్చేలా చేశారు. ఈ సందర్భంగా క్లినిక్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారుడు మైకులో మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 22 ఏళ్ల తర్వాత తమ జీవితంలో చిగురించిన ఈ ఆనందానికి కారణమైన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
