రచన: TVR విఠల్, జన గళం పామర్రు డెస్క్: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతమే లక్ష్యంగా శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా బుధవారం (30-09-2026) విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన స్వయంగా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం అధికారిక పర్యటన షెడ్యూల్ను విడుదల చేసింది.
పర్యటన వివరాలు:
- ఉదయం 10:00 గంటలకు (పామర్రు మండలం – పల్లె పండుగ 3.0):
- పామర్రు టౌన్ గంగానమ్మ గుడి దగ్గర నుండి శివాలయం వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
- కొండిపర్రు గ్రామంలో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.
- అడ్డాడ గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.
- జమిగొల్వేపల్లి గ్రామంలో సీసీ మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.
థాపన.
- మధ్యాహ్నం 01:00 గంటలకు: పల్లెతుమ్మలపాలెంలో అలీ రజా గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
- సాయంత్రం 05:00 గంటలకు (పెదపారుపూడి మండలం – పల్లె పండుగ 3.0): 5. యలమర్రు గ్రామంలో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన. 6. చినపారుపూడి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.
ప్రజాసేవకే తన జీవితం అంకితమని, గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
