రచన: మహమ్మద్ రఫీ, జన గళం పామర్రు డెస్క్: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ బుధవారం (సెప్టెంబర్ 30) నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఆయన అధికారిక పర్యటన వివరాలను మీడియాకు విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చేరుకుని, ఇటీవల దివంగతులైన గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు నీలపు అప్పారావు గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటలకు పెదపారుపూడి మండలానికి చేరుకుని, మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న మరియు వివిధ కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న పలు బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయ వర్గాలు కోరాయి.
