జన గళం ఎన్నికల డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు తోటమూల గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయం (కొరియర్ శ్రీను ఆఫీస్) నందు అత్యవసర కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఎన్నికల సన్నాహాలు, క్షేత్రస్థాయి సమన్వయం, వార్డు, పంచాయతీ స్థాయి కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు. పెడన నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ నాయకులు, నిర్వాహక దళ్ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు అంకం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు పిలుపునిచ్చారు.
