జన గళం సినిమా బ్యూరో: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని, అగ్ర హీరోలతో ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన ప్రముఖ ‘మాస్ డైరెక్టర్’ శ్రీ వి.వి. వినాయక్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రొక్కం శివశంకర్ రాయల్ తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టాలీవుడ్‌లో ‘మాస్ కా బాస్’ దర్శకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వి.వి. వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి, టాగోర్, లక్ష్మి, నాయక్ వంటి ఎన్నో అఖండ విజయాలను సాధించిన చిత్రాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా, ఇండస్ట్రీలో అందరితో ఆప్యాయంగా ఉండే వినాయక్ మరిన్ని అద్భుతమైన చిత్రాలతో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జన గళం సినిమా బ్యూరో తరఫున ఘన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
Slug: vv-vinayak-birthday-wishes-tollywood-mass-director-rokkam-sivashankar-royal
