బ్రేకింగ్ న్యూస్
ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసనఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన
ఆంధ్ర

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనం

YSR Kadapa police arrest 9 red sanders smugglers and seize 1.8 tons of logs in three different cases.
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనం

కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మూడు వేర్వేరు కేసుల్లో (మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో) సుమారు 1.810 టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలతో పాటు, స్మగ్లింగ్ కు ఉపయోగిస్తున్న 5 ఫోర్ వీలర్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

1. మన్నూరు పీఎస్ పరిధిలో భారీ పట్టివేత రాజంపేట మండలం ఆకేపాడు క్రాస్ రోడ్ వద్ద పోలీసులు, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి వైపు నుంచి వస్తున్న ఒక అశోక్ లేలాండ్ కంటైనర్ లారీ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన సిబ్బంది ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని వడమంచి మురళి (తిరుపతి జిల్లా), పాలెపు మనోహర్ (తిరుపతి జిల్లా), రాజస్థాన్ కు చెందిన సునీల్ కుమార్ గా గుర్తించారు. వీరి నుంచి 1037 కేజీల బరువున్న 42 ఎర్రచందనం దుంగలు, కంటైనర్ లారీ, మారుతీ XL6 కారును స్వాధీనం చేసుకున్నారు.

2. వీరబల్లి పీఎస్ పరిధిలో మరో ముఠా అరెస్ట్ వీరబల్లి అటవీ ప్రాంతంలోని కొనేటివాండ్లపల్లి గ్రామం సమీపంలో మామిడితోట వద్ద ఎర్రచందనం దుంగలను ఇన్నోవా కారులో లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి పలువురు పరారీ కాగా, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన డ్రైవర్ సయ్యద్ షాబుద్దీన్ (36) పట్టుబడ్డాడు. విచారణలో అతను చెట్లను నరికి కారులో లోడ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి 179 కేజీల బరువున్న 8 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

3. ఖాజీపేట పీఎస్ పరిధిలో దాడులు ఖాజీపేట – బద్వేల్ మెయిన్ రోడ్డులోని చిల్లకనుమ (నాగసానిపల్లి పల్లె) వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించి మిగిలిన నిందితులను, ఎర్రచందనం దుంగలను మరియు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.

Related News Desk ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

ఎస్పీ కఠిన హెచ్చరిక ఎర్రచందనం అక్రమ నరికివేతకు, రవాణాకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ సంపదను కాపాడేందుకు నిరంతరం అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

SLUG: YSR Kadapa police arrest 9 red sanders smugglers and seize 1.8 tons of logs in three different cases.