పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు
- పవన్ కళ్యాణ్, నాగబాబు ఆలోచనల స్ఫూర్తితో 300 మందికి మట్టి విగ్రహాల అందజేత
- ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసిన అమ్మిశెట్టి వాసు
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్‌లో 300 మంది స్థానికులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు పిలుపు మేరకు పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వయంగా మట్టి గణపతుల విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుతూ పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని 29వ డివిజన్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మారాసు రమణ, సాధు వెంకటరావు నాయుడు దగ్గరుండి సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో రాధా-రంగా మిత్రమండలి సీనియర్ నాయకులు పంచకర్ల రాంబాబు, బాల, టీడీపీ డివిజన్ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ సింగం వెంకన్న, టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అంగిరేకుల రాంబాబు, స్థానిక టీడీపీ నాయకులు అడపా కోటేశ్వరరావు, బర్మా శ్రీను, చిరంజీవి యువత నాయకులు పసుపులేటి శ్రీధర్, సిగిరిశెట్టి శివ, జనసేన అభిమానులు కె.వసంత్, జి.భవాని శంకర్ మరియు స్థానిక జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
