శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ చలపతిరావు పూజలు
- ఆలయ చైర్మన్ కొట్టె సాయిని మర్యాదపూర్వకంగా కలిసిన వైనం
శ్రీకాళహస్తి:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత అమ్మవార్లను కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్ శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు ఆదివారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేసి, వేదాశీర్వచనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కొట్టె సాయి గారిని శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా పలకరించి, ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
