పర్యావరణాన్ని పరిరక్షించేలా మట్టి గణపతులనే పూజిద్దాం: చిరంజీవి యువత పిలుపు
- బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో ఘనంగా ఉచిత విగ్రహాల పంపిణీ
- మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో కార్యక్రమం
బంటుమిల్లి / పెడన:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పెడన నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని లక్ష్మీపురం సెంటర్లో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా చిరంజీవి యువత ప్రతినిధులు మాట్లాడుతూ.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల వల్ల ప్రకృతికి, జలవనరులకు కలుగుతున్న నష్టాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పర్యావరణ హిత పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ, బంటుమిల్లి మండల చిరంజీవి యువత నాయకులు, జనసేన-కూటమి శ్రేణులు, మెగా అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
