జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు మండల జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పార్టీ ముసుగులో జరుగుతున్న కుటిల రాజకీయాలు, కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను నిరసిస్తూ సోమవారం ఉదయం 7:00 గంటల నుంచి స్థానిక గూడూరు పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
గూడూరు మండల జనసేన సీనియర్ నాయకులు బత్తిన హరిరామ్ ఆధ్వర్యంలో 66 సంవత్సరాల వయోవృద్ధ క్రియాశీలక కార్యకర్త కనపర్తి వెంకన్న మరియు మండల జనసైనికులు ఈ ఆమరణ దీక్షకు దిగుతున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి జెండా మోసిన నిబద్ధత గల కార్యకర్తలకు న్యాయం జరగాలని, డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తక్షణ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. ఈ ప్రజాస్వామ్య నిరసనను క్షేత్రస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వార్తా కవరేజ్ అందించాలని వారు కోరారు.
