అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2వ తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోసం గుర్తులను అధికారికంగా ప్రకటించారు.
ఇందులో భాగంగా సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం 20 గుర్తులను ఎస్ఈసీ కేటాయించింది. వీటికి అదనంగా ఓటింగ్ ప్రక్రియలో ‘నోటా’ (NOTA) అందుబాటులో ఉండనుంది. ఒకవేళ ఏదేని వార్డు లేదా పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య కేటాయించిన గుర్తుల కంటే పెరిగితే, ఎన్నికల సంఘం అదనంగా మరిన్ని కొత్త గుర్తులను కేటాయిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
- సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు (మొత్తం 25):
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు-సాసరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా. - వార్డు సభ్యుల గుర్తులు (మొత్తం 20):
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్, బీరువా, ఐస్ క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు.
