డివిజన్ అభివృద్ధియే పరమావధిగా ప్రచార రంగంలోకి.. కూటమి శ్రేణుల్లో ఉత్సాహం
జన గళం బ్యూరో, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 67వ డివిజన్ స్థానంపై ఎన్డీయే కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. జనసేన పార్టీ తరఫున నిబద్ధత కలిగిన నాయకులు శ్రీ లకనం శ్యామ్ ప్రసాద్‌ను ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దింపింది.
ఈ సందర్భంగా స్థానిక కూటమి నేతలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ దృక్పథాన్ని ప్రతి గడపకూ చేరవేసేందుకు శ్రేణులు సన్నద్ధమైనట్లు తెలిపారు. గతంలో డివిజన్లో ఎదురైన సమస్యలను పరిష్కరించి, ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దే సత్తా లకనం శ్యామ్ ప్రసాద్‌కు ఉందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశాయి. కూటమి నాయకులు, వీర మహిళలు, జనసైనికులు వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసి కూటమి అభ్యర్థి విజయానికి బాటలు వేస్తున్నారు.
