జన గళం మచిలీపట్నం డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యత సాధించడమే లక్ష్యంగా జనసేన పార్టీ సమరశంఖం పూరించింది. మచిలీపట్నం ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులు, సపోర్ట్ టీంతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి సమన్వయం, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, వార్డు, పంచాయతీ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపునకు నిర్వాహక దళ్ సభ్యులు చురుగ్గా పనిచేయాలని ఎంపీ బాలశౌరి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి చారిత్రాత్మక విజయాన్ని సాధించాలని నాయకులు, సాంకేతిక బృందాలకు దిశానిర్దేశం చేశారు.
