బ్రేకింగ్ న్యూస్
గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమం: విలీనంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. వార్డుల పునర్విభజన, ఎన్నికల కసరత్తుకు గ్రీన్ సిగ్నల్!25 ఏళ్ల మోదీ సుపరిపాలనకు ప్రతీకగా ‘సేవా సంకల్ప అభియాన్’: కృత్తివెన్ను మండలంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం!తునిలో జనసేన జోరు: యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీలోకి 2,000 మంది చేరిక, త్వరలో సభజాతీయ రాజకీయాల్లోకి సరికొత్త శక్తిగా ‘సర్వజన్ సనాతన్ పార్టీ’ ఆవిర్భావం: జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీబీఐ చీఫ్ ఎం. నాగేశ్వరరావు.. వారణాసి వేదికగా పార్టీ పగ్గాలు స్వీకరించి సంచలన ప్రకటన!సేవా సంకల్ప అభియాన్’ జిల్లా స్థాయి డిబేట్‌లో బంటుమిల్లి సెయింట్ జాన్స్ విద్యార్థిని ప్రతిభ: సీనియర్స్ విభాగంలో కె. కుసుమాంజలికి ప్రథమ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!జిల్లా స్థాయి ‘సేవా సంకల్ప్’ వక్తృత్వ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థి ప్రతిభ: పి. మహిధర్‌కు తృతీయ బహుమతి.. అక్టోబర్ 9న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!బంటుమిల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబుపై పోలీసులకు ఫిర్యాదు: దళిత మహిళపై ఆరోపణల వ్యవహారంలో ఎస్ఐకి వైసీపీ, దళిత సంఘాల నేతల వినతి!నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమం: విలీనంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. వార్డుల పునర్విభజన, ఎన్నికల కసరత్తుకు గ్రీన్ సిగ్నల్!25 ఏళ్ల మోదీ సుపరిపాలనకు ప్రతీకగా ‘సేవా సంకల్ప అభియాన్’: కృత్తివెన్ను మండలంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం!తునిలో జనసేన జోరు: యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీలోకి 2,000 మంది చేరిక, త్వరలో సభజాతీయ రాజకీయాల్లోకి సరికొత్త శక్తిగా ‘సర్వజన్ సనాతన్ పార్టీ’ ఆవిర్భావం: జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీబీఐ చీఫ్ ఎం. నాగేశ్వరరావు.. వారణాసి వేదికగా పార్టీ పగ్గాలు స్వీకరించి సంచలన ప్రకటన!సేవా సంకల్ప అభియాన్’ జిల్లా స్థాయి డిబేట్‌లో బంటుమిల్లి సెయింట్ జాన్స్ విద్యార్థిని ప్రతిభ: సీనియర్స్ విభాగంలో కె. కుసుమాంజలికి ప్రథమ బహుమతి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!జిల్లా స్థాయి ‘సేవా సంకల్ప్’ వక్తృత్వ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థి ప్రతిభ: పి. మహిధర్‌కు తృతీయ బహుమతి.. అక్టోబర్ 9న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!బంటుమిల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబుపై పోలీసులకు ఫిర్యాదు: దళిత మహిళపై ఆరోపణల వ్యవహారంలో ఎస్ఐకి వైసీపీ, దళిత సంఘాల నేతల వినతి!నామినేటెడ్ పదవులు గడువు ముగుస్తోంది.. కార్యకర్తల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?పెనమలూరులో 853 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ: రాజముద్రతో అన్నదాతల ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్!స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక భేటీ: పాత కమిటీలన్నీ రద్దు.. త్వరలోనే నూతన కమిటీలు.. క్షేత్రస్థాయి బలం ఆధారంగానే తుది నిర్ణయం!
ఆంధ్ర

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు… లిక్కర్ స్కాం మేజర్ వాటా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరింది

machilipatnam-minister-kollu-ravindra-liquor-scam-tadepalli-palace
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు… లిక్కర్ స్కాం మేజర్ వాటా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరింది

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయని, ఈ స్కామ్‌లో మేజర్ వాటా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని రాష్ట్ర క్రీడా, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన కూటమి చైతన్య యాత్రలో ఆయన ఉత్సాహంగా పాల్గొని నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలను తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు మెరుగైన సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ లిక్కర్ స్కామ్‌కు తాడేపల్లి ప్యాలెస్‌లోనే స్పష్టమైన ప్రణాళిక రచింపబడిందని, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన వారే స్వయంగా ఈ విషయాలను బయటపెడుతున్నారని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే జీర్ణించుకోలేక గంజాయి బ్యాచ్‌తో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలభై కోట్ల రూపాయల సుపారీ ఎవరిచ్చారు, ఆ డబ్బుల మూలాలు ఎక్కడివి, అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరన్న దానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోందని అన్నారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరియు ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Related News Desk గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమం: విలీనంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. వార్డుల పునర్విభజన, ఎన్నికల కసరత్తుకు గ్రీన్ సిగ్నల్!

ఎవరెన్ని కుట్రలు పన్నినా, మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించినా వాస్తవాలన్నీ ప్రజల ముందుకు వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర తేల్చిచెప్పారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా బాధ్యులను కఠినంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ప్రజల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని చైతన్య యాత్రను విజయవంతం చేశారు.

Slug: machilipatnam-minister-kollu-ravindra-liquor-scam-tadepalli-palace