జన గళం బ్యూరో: నిస్వార్థ ప్రజా సేవకుడు, సేవాతత్పరుడు, మెగా సోదరుడు శ్రీ రాందాస్ చందక జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆత్మీయ మిత్రుడు కటకం రామకృష్ణ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ హితం కోసం నిరంతరం తపించే స్నేహశీలి రాందాస్ చందక నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ప్రజాసేవలో, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో రాందాస్ చందక ఎల్లప్పుడూ ముందుంటారని కటకం రామకృష్ణ కొనియాడారు. నిస్వార్థ గుణం, స్నేహపూర్వక స్వభావంతో అందరి మన్ననలు పొందుతున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. రాందాస్ చందక పుట్టినరోజు సందర్భంగా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
