జన గళం సినీ బ్యూరో: టాలీవుడ్ ప్రముఖ మాస్ మరియు కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి. వినాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కటకం రామకృష్ణ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆది, ఠాగూర్, లక్ష్మి, ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్బస్టర్ విజయాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వి.వి. వినాయక్. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ రంగ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కటకం రామకృష్ణ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.
