జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ సీనియర్ నాయకులు కొట్టే వెంకట్రావు, మాదివాడ రాములతో ప్రత్యేకంగా చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా నిలబెట్టడమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లు, పరిసర పంచాయతీల వారీగా పార్టీ బలాబలాలు, పోటీ చేసే విధివిధానాలపై నాయకులతో సమగ్రంగా సమీక్షించారు. డివిజన్, పంచాయతీ స్థాయి ఇన్‌చార్జులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందరూ సమష్టిగా పనిచేసి మచిలీపట్నంలో పార్టీ జెండాను రెపరెపలాడించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయగిరి శ్రీరామ్ మోహనరావు (RSR), కూనసాని పరమేశ్వరరావు, సనక భాస్కరరావు, సోమిశెట్టి గోపాలకృష్ణారావు, శాయన శివయ్య, జగదీష్, తోట భాస్కరరావు, సంకుల నాని, బడేటి వెంకటరమణ, మేడిశెట్టి యోగేశ్వరరావు, అప్పారావు, అడపాల వెంకటేశ్వరరావు, రాజా, ప్రసాదరావు, లంక గంగాధరరావు, రవి, సుబ్బారావు, పుప్పాల అనిల్ కుమార్, శ్రీనివాసరావు, చలమలశెట్టి అయ్యప్పరావు, సతీష్ కుమార్, బాబు, ప్రేమ్ కుమార్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
