జన గళం రాజకీయ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ సమ ప్రాధాన్యత కల్పించే దిశగా ఆరు ప్రధాన నగరాల మేయర్ స్థానాలపై జనసేన అధిష్టానం గురి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేన ఆశిస్తున్న మేయర్ పీఠాలు:
- విజయవాడ (సెంట్రల్ ఆంధ్రా)
- విశాఖపట్నం (ఉత్తరాంధ్ర)
- ఏలూరు (గోదావరి జిల్లాలు)
- ఒంగోలు (ప్రకాశం / గ్రేటర్ రాయలసీమ ముఖద్వారం)
- తిరుపతి (రాయలసీమ)
- శ్రీకాకుళం (ఉత్తరాంధ్ర)
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కీలక నగరాల మేయర్ పదవులను జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో భాగంగా ఈ కార్పొరేషన్లను దక్కించుకుని తమదైన ముద్ర వేయాలని అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
