జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సమగ్ర షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. పోటీ చేయదలచిన అభ్యర్థులు ఈ షెడ్యూల్ తేదీలను గమనించాలని సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- అక్టోబర్ 21, 2026 నుండి అక్టోబర్ 23, 2026 వరకు ఆయా మండలాల ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
- అక్టోబర్ 24, 2026న నామినేషన్ల పరిశీలన (స్కూటినీ) ఉంటుంది.
- అక్టోబర్ 25, 2026న నామినేషన్ ఫారమ్లో ఏవైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- అక్టోబర్ 26, 2026న ఎన్నికల అధికారి తిరస్కరించిన నామినేషన్లపై తుది నిర్ణయం ప్రకటిస్తారు.
- అక్టోబర్ 27, 2026న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
- అక్టోబర్ 27, 2026 సాయంత్రం ఎన్నికల అధికారి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ పదవులకు పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితాను నోటీస్ బోర్డులో ప్రకటిస్తారు.
- నవంబర్ 3, 2026న ఓటర్లకు పోలింగ్ నిర్వహించబడుతుంది.
- నవంబర్ 4, 2026న అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్ నిర్వహిస్తారు.
- నవంబర్ 5, 2026న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అదేవిధంగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం అందజేస్తారు.
ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా వెలువడటంతో గ్రామీణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
