బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
రాజకీయం

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా: నిజమేనా.. వ్యూహాత్మక లీకా?

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా: నిజమేనా.. వ్యూహాత్మక లీకా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘తొలి జాబితా’ వెనుక మతలబేంటి?

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా.. ఏలూరు రెడ్డి అప్పలనాయుడు.. పెడనలో మట్టా శివపావని? కూటమిలో చర్చలు కొలిక్కి వచ్చాయా.. లేక అసంతృప్తుల నాడి పట్టేందుకేనా?

​ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను దుమారం రేగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లుగా సోషల్ మీడియా వేదికలపై ప్రత్యక్షమైన “మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా” ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు నగర కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లతో ఉన్న ఈ జాబితా అసలైనదేనా? లేక ఎన్నికల వేళ ప్రత్యర్థుల, ఆశావహుల నాడి పట్టుకునేందుకు నాయకత్వం చేసిన వ్యూహాత్మక ఎత్తుగడా?

​బెజవాడ పీఠంపై వంగవీటి రాధా నిజమేనా?

Related News Desk పెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!

అత్యంత కీలకమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఇటీవల జనసేన గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ పేరు ఉండటం పెను సంచలనంగా మారింది. విజయవాడలో టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రాకముందే రాధా పేరు తెరపైకి రావడం వెనుక ఆంతర్యమేంటి? కూటమి అగ్రనేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య బెజవాడ మేయర్ పీఠంపై ముందస్తు ఒప్పందం కుదిరిందా? టీడీపీ సిట్టింగ్ ఆశావహులు దీనికి అంగీకరిస్తారా?

​పెడన పీఠం.. ‘బళ్ళ’ చేరిక వేళ ‘మట్టా’కేనా?

జాబితాలో పెడన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీమతి మట్టా శివపావని పేరు ఖరారైనట్లు పేర్కొన్నారు. అయితే, నిన్నగాక మొన్ననే ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత సమక్షంలో పార్టీలో చేరిన మాజీ చైర్‌పర్సన్ బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి పరిస్థితి ఏమిటి? బళ్ళ కుటుంబం చేరికతో పెడనలో కూటమి సమీకరణాలు మారాయనుకుంటున్న వేళ.. ఈ జాబితా వెలువడటం స్థానిక కేడర్‌ను గందరగోళానికి గురిచేస్తోందా? మట్టా పావనికే పగ్గాలు ఖరారైతే కొత్తగా చేరిన సీనియర్లకు సర్దుబాటు ఎలా చేస్తారు?

​మిగిలిన స్థానాల్లో ‘గెలుపు గుర్రాలు’ వీరేనా?

  • ​ఏలూరు కార్పొరేషన్: ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు పేరును ఖరారు చేయడం స్థానిక టీడీపీ నేతలకు సమ్మతమేనా?
  • ​పిఠాపురం & తెనాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో డాక్టర్ బీరా విజయ్ శేఖర్, తెనాలిలో తోటకూర వెంకట రమణారావుల పేర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి?
  • ​ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి: నరసాపురం (కొత్తపల్లి శైలజ), నిడదవోలు (కల్లం జ్యోతి), అమలాపురం (నల్లా శ్రీధర్), సామర్లకోట (పిట్టా జానకి రామారావు) వంటి కీలక స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న పాతతరం నాయకుల ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది?
  • ​ఉత్తరాంధ్ర & రాయలసీమ: సాలూరులో గొర్లె విజయకుమారి, పుత్తూరులో డి. ఏలుమలై పేర్లపై క్షేత్రస్థాయి నివేదికలు అనుకూలంగా ఉన్నాయా?