జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మరణం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి ప్రజా రంగానికి తీరని లోటని పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకెం సీతారామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో యూత్ కాంగ్రెస్‌లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించి, అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఆళ్ల నాని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అకాల మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆళ్ల నాని కుటుంబానికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన పూర్తి సంఘీభావం తెలుపుతూ అంకెం సీతారామ్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
